హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన టపాసులు పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెయిన్‌బజార్‌లోని ఓ ఇంట్లో టపాసులు పేలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఇద్దరు దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలినట్లు తెలిపారు. By Archana 29 Oct 2024 in హైదరాబాద్ Latest News In Telugu New Update Yakutpura షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాకత్‌పురా రైల్వేస్టేషన్ దగ్గరలోని రెయిన్‌బజార్‌లో ఓ ఇంట్లో టపాసులు పేలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఇద్దరు దంపతులు అక్కడే మృతి చెందారు. అయితే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం దీపావళి సందర్భంగా ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పై .. ఆ పక్కనే పేలుస్తున్న టపాసులు పడడంతో మంటలు అంటుకున్నట్లు తెలిపారు. Also Read: 24ఏళ్ల తర్వాత తొలిసారి.. ప్రపంచ వేదికపై భారతీయ అందాల భామకు కిరీటం ఇది ఇలా ఉంటే ఇటీవలే వరంగల్ జనగామ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయ షాపింగ్ మాల్ లోషార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో షాపింగ్ మాల్ పూర్తిగా కాలిపోయింది. అలాగే చుట్టుపక్కల ఉన్న 5, 6 షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. పండగ వేళ ఇలాంటి ఘటన జరగడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కార్ల వర్క్ షాపులో మరో అగ్ని ప్రమాదం.. వారం రోజుల కిందట హర్యానాలోని గురుగ్రామ్ లోని ఓ కార్ల వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 16 లగ్జరీ కార్లు దగ్థమయ్యాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయని సమాచారం.మోతీ విహార్ ప్రాంతంలోని బెర్లిన్ మోటార్ వర్క్‌షాప్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. అయితే.. పదహారు లగ్జరీ కార్లు వర్క్‌షాప్‌లో పార్క్ చేశారని.. ఇవన్నీ కాలి బూడిదయ్యాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వీటితోపాటు కొన్ని పాత వాహనాలు కూడా దగ్ధమైనట్లు అధికారులు చెప్పారు. సమాచారమందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పేశామని పేర్కొన్నారు. మెర్సిడెస్, ఆడి క్యూ 5, బీఎమ్‌డబ్ల్యూ, రేంజ్ రోవర్, వోల్వో, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, ఒపెల్ ఎస్ట్రా, జాగ్వార్‌తో పాటు పదహారు అత్యాధునిక కార్లు వర్క్‌షాప్‌లో పార్క్ చేసి ఉంచారు. ఈ ప్రమాదంలో ఇవన్నీ బూడిదగా మారాయి. అగ్నిప్రమాదంలో కొన్ని స్క్రాప్డ్ వాహనాలు కూడా బూడిదైనట్లు అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. Also Read: అరుణాచలంలో భర్తతో కలిసి శివజ్యోతి పూజలు.. ఫొటోలు వైరల్ Also Read: నాగ్ మామ హోస్టింగ్ మామూలుగా లేదు.. కంటెస్టెంట్స్ కుండ పగిలింది! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి