HYD Metro
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం రోజు (సెప్టెంబర్ 17)న అర్ధరాత్రి 1 వరకూ మెట్రో సర్వీసులు నడపనున్నట్ల తెలిపారు. ఈ మేరకు అన్ని మెట్రో లైన్లలో సెప్టెంబర్ 18న 1AM వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని HMRL MD NVS రెడ్డి సూచించారు. తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రయాణీలు వారి గమ్యస్థానాలకు చేరుకోనుండగా.. ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో పోలీసులు భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ మేరకు ఎన్వీఎస్ రెడ్డ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ముగిసేవరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు నడపుతాం. డిమాండ్‌కు అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. రెండు వారాలుగా మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రతిరోజూ 5 లక్షల ప్రయాణిస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ను సుమారు 94వేల మంది వచ్చినట్లు తెలిపారు.