Explosion Near Mailardevpalli Temple
Hyderabad: హైదరాబాద్ లో మరో పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెట్ రెస్టారెంట్‌లో ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెస్టారెంట్ చుట్టు పక్కన ఇల్లు ధ్వంసం కాగా.. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా కాకముందే మరో పేలుడు సంభవించింది.
మైలార్‌దేవ్‌పల్లిలో పేలుడు
ఈరోజు రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో పేలుడు కలకలం రేగింది. లక్ష్మీగూడ రోడ్ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో చెత్తను తొలగిస్తుండగా.. ఒక్కసారిగా ఆలయం దగ్గర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆలయంలో ఉన్న పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాల పై దర్యాప్తు చేపట్టారు.
Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!