Wife Illegal Affair: మేనల్లుడితో ఇద్దరు పిల్లల తల్లి జంప్.. 7నెలల తర్వాత షాకింగ్ ఇన్సిడెంట్

సీతాపూర్‌కు చెందిన పూజ మిశ్రా, తన భర్త మేనల్లుడు అలోక్‌తో ఏడు నెలల సహజీవనం తర్వాత విడిపోయింది. అలోక్ పెళ్లికి నిరాకరించగా, పోలీసు స్టేషన్‌లో ఆమె బ్లేడ్‌తో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను లక్నోకు తరలించారు.

New Update
ghaziabad sitapur Wife illegal relationship with her nephew

ghaziabad sitapur Wife illegal relationship with her nephew

ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్‌లోని పిసావా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతుబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో మరో అక్రమ సంబంధం వ్యవహారం బయటపడింది. ఇద్దరు పిల్లల తల్లి పూజా మిశ్రా తన మేనల్లుడితో గాఢంగా ప్రేమలో పడింది. అయితే ఓ రోజు ఆమె పోలీసుల ముందే తన చేతిని కోసుకుంది. తన మేనల్లుడు ఆమెతో సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించడంతో ఆ మహిళ బ్లేడుతో కోసుకుంది. వెంటనే పోలీసులు ఆ మహిళను హాస్పిటల్ లో చేర్పించారు. అనంతరం ఆమె మేనల్లుడికి ఫోన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Wife illegal relationship

ఢిల్లీకి చెందిన పూజా మిశ్రా, ఘజియాబాద్‌లో పనిచేసే లలిత్ కుమార్ మిశ్రాను వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఈ దంపతులు హ్యాపీగా ఉండేవారు. అయితే లలిత్  కుమార్ తన మేనల్లుడు అలోక్ మిశ్రాను తనతో పాటు పనిలో పెట్టుకున్నాడు. అదే సమయంలో లలిత్ భార్య పూజ మిశ్రా, మేనళ్లుడు అలోక్ మధ్య ప్రేమ వ్యవహారం పెరిగింది. ఒకరోజు పూజా, అలోక్ ల వ్యవహారం గురించి ఆమె భర్త లలిత్ కుమార్ మిశ్రాకు తెలిసింది. 

దీంతో అతడు తన మేనళ్లుడు అలోక్ ను తన పని నుంచి తీసేసి.. బయటకు పంపించేశాడు. ఈ విషయం తెలుసుకున్న లలిత్ భార్య పూజా మిశ్రా తన ఇద్దరు పిల్లలను వదిలి అలోక్ తో కలిసి బరేలీకి వెళ్లిపోయింది. వారు బరేలీలో దాదాపు ఏడు నెలలు కలిసి జీవించారు. అక్కడ అలోక్ ఆటో నడుపుతూ ఉండేవాడు. అనంతరం వారి ఇల్లీగల్ రిలేషన్ లో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ పలు కారణాల వల్ల తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. 

ఈ క్రమంలో పూజా, అలోక్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అలోక్ తన ప్రియురాలు పూజా మిశ్రాను వదిలి బరేలి నుంచి  తన స్వగ్రామం మాధియా సీతాపూర్ కు తిరిగి వచ్చాడు. అలోక్ తనను విడిచిపెట్టాలనుకుంటున్నాడని పూజకు తెలియగానే.. ఆమె కూడా సీతాపూర్ కు వెళ్ళింది. ఈ విషయాన్ని పరిష్కరించడానికి ఆమె పిసావా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కుతుబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. పోలీసులతో రాజీ కుదిర్చిన సమయంలో.. అలోక్ మిశ్రా పూజతో తన సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన పూజ అక్కడికక్కడే బ్లేడ్ తో తన చేతిని కోసుకుంది. దీంతో పూజ తన చేతిని కోసుకున్న సంఘటన పోలీస్ స్టేషన్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెంటనే ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. 

Advertisment
తాజా కథనాలు