Rain Alert: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , ఎల్‌బీ నగర్, ఉప్పల్, హయత్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్‌పుర, సోమాజిగూడ, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్, కూకట్‌పల్లి, బాలానగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్,ఈసిఐఎల్,మౌలాలి భారీ వర్ష పాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరాయి.
Scattered Rains🌧️ across East Hyd - Malkajgiri, Sainikpuri, Cherlapally, ECIL, Mallapur, Medipally, Boduppal, Hayathnagar (Near-by Areas) next 30-45 Mins#HyderabadRainshttps://t.co/cckJaSXVcA
— Weatherman Karthikk (@telangana_rains) September 14, 2025
కొట్టుకుపోయిన మామ అల్లుల్లు
దాదాపు 12 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మాదాపూర్ ఏరియాలో కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు వరద నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు, నడుచుకుంటే వెళ్ళేవారు నానా అవస్థలు పడుతున్నారు. కాలువలు, డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి.
హైదరాబాద్ లోని కొన్ని రోడ్లు చిన్నపాటి వాగుల్లా దర్శనమిస్తున్నాయి. భారీ వర్షానికి హబీబ్ నగర్ లోని ఆఫ్జాల్ సాగర్ కాలువలో మామా అల్లుళ్ళు ఇద్దరు కొట్టుకుపోయారు. డ్రైనేజ్ నీటిలో మామ కొట్టుకుపోవడతో .. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతు అయ్యాడు. వీరి ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో హైడ్రా, ghmc, అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై మ్యాన్ హోల్స్ క్లోజ్ చేయడం, ప్రజలను అలెర్ట్ చేయడం చేస్తున్నారు.
అలాగే ముషీరాబాద్ లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా.. భారీ వర్షానికి ఆ గోడ కూలడంతో 24 ఏళ్ల సన్నీ అనే యువకుడు గకల్లంతు అయ్యాడు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు.
Also Read: Horror Movie: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ మూవీ! ఒక్క సీన్ కూడా వదలరు!