Heavy Rain In Hyderabad:
మామూలుగానే హైదరాబాద్ రోడ్లు ఎప్పుడూ బిజీగా ఉంటాయి. అది కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు జనాలు అందరూ రోడ్ల మీదనే ఉంటారు. అలాంటి టైమ్‌లో వర్షం పడితే ఇంకేమైనా ఉందా. ఈరోజు అదే జరిగింది. ఉన్నట్టుండి హైదరాబాద్‌లో భారీగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయ్యాయి. దాంతో పాటుగా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీస్‌లు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో జోరు వాన కురువడంతో ఉద్యోగులు అవస్థలు పడ్డారు.
హైటెక్ సిటి నుండి సికింద్రాబాద్, పంజాగుట్ట నుండి ఎల్బీ నగర్, సికింద్రాబాద్ నుండి ఎల్బీ నగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ లో వర్షపు నీరు రోడ్లపై భారీగా నిలిచిపోయింది. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వర్షం నీరు చేరిపోయిన ప్రాంతాల్లో సహయక చర్యలు చపట్టారు. నీటిని తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. దాంతో పాటూ మరికొంతసేపు ఇలాగే వర్షం కురుస్తుందని..జనాలు ఇళ్ళల్లోకి రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు.
హైదరాబాద్‌లోని బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఉప్పల్, ఎల్ బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, లక్డీకపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Also Read: Space: నేలపై జాబిల్లి..రెండు నెలలు భూమిపై చందమామ వెకేషన్