Group-1 mains Exams:
గ్రూప్-1మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని తేల్చిచెప్పారు. ప్రిలిమ్స్ పరీక్షలు అయ్యాక విపక్షాలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 29తో తాము నష్టపోతున్నామని ఇటీవల హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ -1 నియామకాల్లో రిజర్వేషన్ అనుసరించడం పేర్కొన్నారు. జీవో నంబర్ 29 అమలు చేయడం వల్ల గ్రూప్-1 రాసే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. దీని కోసమే అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు.
ప్రభుత్వం చర్చలు...
ఇంతలా అభ్యర్థులు ఆందోళనలు చేయడం..ప్రతిపక్షాలు పలకడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. నిన్న రాత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మంత్రులు దామోదర్ రాజనర్శింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా పాల్గొన్నారు. గ్రూప్-1 పరీక్షను అసలు వాయిదా వేయడం సాధ్యమా అనే కోణంలో అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా మూడు గంటలపాటుచర్చించారని తెలుస్తోంది. జీవో 29పై వస్తున్న విమర్శలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారమే పరీక్షలు ఉన్నందువల్ల ఈరోజు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తే కష్టపడి చదువుకున్న అభ్యర్థుల నుంచి ప్రతికూలత వస్తుందేమో అని కూడా ఆలోచించారు. పరీక్షను వాయిదా వేయకుండా, ఏ ఒక్క అభ్యర్థీ నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు చర్చించారు. ఈరోజు మరోమారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ప్రకటించారు కూడా. ఇప్పుడు గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షల గురించి ఉత్కంఠత పెరిగింది.
Also Read: Ap: కృష్ణా నదిలో వరద..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత