/rtv/media/media_files/4Djm6EtOeT91MqjDZtr0.jpg)
Telangana Government:
హైదరాబాద్‌లో గత కొన్ని రోజలుగా హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఫుల్ పర్మిషన్స్, పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడంతో అక్రమ కట్టడాలన్నింటినీ కూకటి వేళ్ళతో సహా పరికించేస్తోంది. చిన్నా, పెద్దా అని చూడకుండా అందరికీ సమన్యాయం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది హైడ్రా. దీంతో హైదరాబాద్‌లో చాలా మందికి ఇప్పుడు భయం పట్టుకుంది. తమ ఇల్లు ఎక్కడ అక్రమ నిర్మాణంలో ఉందోనని భయంతో బతుకుతున్నారు. ఈ భయంతోనే దుర్గం చెరువు దగ్గర ఉన్న కావూరి హిల్స్ హౌస్ ఓనర్స్ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇళ్ళను హైడ్రా కూల్చకుండా చూడాలని కోర్టును కోరారు. దీని మీ విచారణ చేసిన కోర్టు ప్రభుత్వాన్ని దుర్గం చెరువు ఎంత వైశాల్యం ఉందో చెప్పాలంటూ వివరణ కోరింది. దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ వివరాలను సెప్టెంబర్ 23లోగా కోర్టుకు సమర్పించాలని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసన్‌లతో కూడిన ధర్మాసనం గత వారం రాష్ట్రాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం దుర్గం చెరువు విసతీర్ణం మొత్తం కొలతలతో సహా ఉన్న నివేదికను సమర్పించింది. ఇందులో చెరువు మొత్తం వైశాల్యం 160 ఎకరాలని స్పష్టం చేసింది. అందులో 65 ఎకరాలకు మించి ఇళ్ళను నిర్మించుకున్నారని తెలిపింది. చెరువును ఆక్రమించుకుని ఇళ్ళను కట్టుకున్న వారికి ఎటువంటి ఉపశమనం ఇవ్వలేమని కూడా తేల్చి చెప్పింది ప్రభుత్వం. దాంతో పాటూ జలమండలి ఎఫ్‌టీఎల్‌ను నిర్ణయించే తుది నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
దీనిపై కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ...మేము మీకు చాలా కాలం క్రితం మూడు నెలల సమయం ఇచ్చాము. మీరు ఆ లోపు పనిని పూర్తి చేయలేదు. ఇప్పుడు మళ్లీ మరో మూడు నెలల సమయం కోరుతున్నారు. ఇలాంటి ముఖ్యమైన సమస్యలను ఎందుకు తప్పించుకుంటారు అంటూ విమర్శించింది. ఇప్పుడు కోర్టు ప్రభుత్వానికి ఆరు వారాల సమయం మాత్రమే ఇస్తుందని.. ఆలోపు దీన్ని పూర్తి చేయాలని ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, హైడ్రా, నీటిపారుదల తదితర శాఖలు నివాసితుల అభ్యంతరాలను వినాలని, ఎఫ్‌టీఎల్‌ను ఖరారు చేసే ముందు వాటిని వినిపించేందుకు అవకాశం కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు నిర్ణయించని ఎఫ్‌టిఎల్ ఎక్కడైతే నిర్ణయించలేదో...ఆ ప్రదేశాలో ఆమోదించబడిన లేఅవుట్‌లో నిర్మించిన వారి భవనాలపై హైడ్రా ముందుకు వెళ్లవద్దని అధికారులను ఆదేశించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు కోర్టును కోరినప్పుడు బెంచ్ దానికి అంగీకరించింది.
Also Read: ఉత్తరప్రదేశ్ ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు..సీఎం యోగి ఆర్డర్