తెలంగాణలో వరద నష్టం 10, 320 కోట్లు

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో చాలా నష్టం వచ్చిందని...వెంటనే సహాయం అందించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. సమగ్ర అంచనాల ప్రకార మొత్తం వరద నష్టం 10, 320 కోట్లు అని స్పష్టం చేశారు.

New Update
revanth

తెలంగాణల వరద నష్టం నివారణ చర్యలు వెంటనే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. కేంద్రం సహాయం చేయాలని కోరుతున్నారు. అన్ని శాఖల నుంచి అందిచ సాచారం మేరకు నష్టం అంచనా 10, 320 కోట్లు ఉందని తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన కేద్ర అధికారుల బృందాలతో సమావేశమయ్యారు. చాలా మంది ప్రజలు ఆపదలో ఉన్నారని...వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఇధులను విడుదల చేయాలని రేవంత్ కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు కొంత వెసలుబాటు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మంకు మున్నేరు వాగు వల్ల వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని సీఎం అన్నారు.

విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనల వల్ల తెలంగాణలో జరిగిన నష్టాన్ని పూడ్చలేమని ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నిబంధనల ప్రకారం...తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్‌ఎఫ్‌లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి అంటున్నారు. కేంద్ర బృందానికి ఈ పరిస్థితి వివరించారు. ఒక కిలోమీటరు రోడ్డు దెబ్బతింటే కేవలం రూ.లక్ష ఖర్చు చేయాలని రేట్లు నిర్ణయించారని...వాటితో తాత్కాలిక మరమ్మత్తులు కూడా చేయలేమని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అపార నష్టంతోపాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని.. అది చూశాక కేంద్రం నిధుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

Advertisment
తాజా కథనాలు