Jubilee Hills by-election:షేక్‌పేట్‌లో బీజేపీ గల్లంతు.. 2 రౌండ్లు కలిపి మూడు వందలే!!

షేక్‌పేట్ డివిజన్ రెండు రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. షేక్‌పేట్‌ డివిజన్ ఫలితాల్లో బీజేపీ కనుమరుగైంది. రెండు రౌండ్లు కలిపి లంకల దీపక్ రెడ్డికి 307 ఓట్లు మాత్రమే వచ్చాయి.

New Update
BJP

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. యూసుఫ్‌గూడ  కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే విడుదలైన షేక్‌పేట్ డివిజన్ రెండు రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది.

షేక్‌పేట్‌ డివిజన్ ఫలితాల్లో బీజేపీ కనుమరుగైంది. రెండు రౌండ్లు కలిపి లంకల దీపక్ రెడ్డికి 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రమంతులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు లెక్కచేయలేదు. రెండు రౌండ్ల కలిపి కాంగ్రెస్ 1144 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు