హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు.. పాల ప్యాకెట్ కోసం వెళ్తే రూ.2 కోట్లు కొట్టేశారు!

హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. నాగభూషణం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్ల నగదుతో పాటు 35 కోట్లు ఎత్తుకెళ్లారు. ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్లి వచ్చే సరికి ఈ దొంగతనం జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update

హైదరాబాద్‌ లో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. పాల ప్యాకెట్ కోసం ఓ వ్యక్తి బయటకు వెళ్లి వచ్చే లోగా.. ఇంట్లో చొరబడిన దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా రూ.2 కోట్ల నగదుతో పాటు 35 తులాల బంగారం ఎత్తుకెళ్లరు. వివరాల్లోకి వెళ్తే.. వివరాల ప్రకారం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగభూషణం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం అతను పాల ప్యాకెట్ తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా దొంగలు అతని ఇంట్లోకి ప్రవేశించి రూ.2 కోట్ల నగదు, 35 తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

భూమి అమ్మడంతో డబ్బు..

ఇటీవల శంకర్ పల్లిలో భూమి అమ్మడంతో ఈ డబ్బు నాగభూషణానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ నాగభూషణం తెలిపారు. సమాచారం అందగానే క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు చెప్పారు. అయితే.. తెలిసిన వారే ఈ దొంగతానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు