హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జూబ్లీహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, మాసాబా ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

New Update

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 7 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వెల్లడించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్..

మరోవైపు వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జర్నలిస్ట్ కాలనీ, అపోలో హాస్పటల్, మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మూమెంట్ స్లోగా ఉందని హైదరాబాద్ పోలీసులు X ద్వారా తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు