panchayat elections : తొలిదశ పోరుకు భారీగా నామినేషన్లు..ఒక్కో సర్పంచి పదవికి సగటున ఆరుగురు..

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈదశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిదశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో ఆరుగురు పోటీపడుతున్నారు.

New Update
Local body Election

telangana sarpanch elections

panchayat elections: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈదశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఈసారి పంచాయతీ ఎన్నికలకు తీవ్ర పోటీ నెలకొన్నది. యువతరం పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో సర్పంచి పదవికి తీవ్ర పోటీ నెలకొంది. 4,236 గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ నోటిఫై చేయగా, సర్పంచి పదవుల కోసం మొత్తం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి.  చివరిరోజైన శనివారం ఒక్కరోజే 17,940 నామినేషన్లు దాఖలయ్యాయి.

తొలిదశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో ఆరుగురు పోటీపడుతున్నారు. 37,440 వార్డు సభ్యులకు గాను 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులోనూ ఒక్క 29 నే 70,596  నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున ఒక్కో వార్డుకు 2.19 మంది పోటీలో ఉన్నట్లు తేలింది.  సర్పంచి, వార్డు సభ్యుల పదవులు పార్టీ రహితంగా నిర్వహిస్తున్నప్పటికీ  ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. కాగా తొలిదశ నామినేషన్ల ఉససంహరణ డిసెంబరు 3న ఉంటుంది. తర్వాత బరిలో ఉండే వారి సంఖ్యలో స్పష్టత రానుంది. తొలిదశ పంచాయతీ ఎన్నికలు డిసెంబరు 11న జరుగుతాయి. అదేరోజున ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైన విషయం తెలిసిందే.

కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అత్యధికంగా సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాల వారీగా సర్పంచి పదవులకు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలో 159 గ్రామ పంచాయతీల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతాయి. అంటే సగటున ఒక్కో పంచాయతీలో 8.7 మంది సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో 99 సర్పంచి పదవులకు 822 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే సగటున 8.3 మంది ఉన్నారు. తర్వాత స్థానంలో మహబూబాబాద్, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో సగటున 8 మంది నామినేషన్లు వేశారు. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో.. ఇక్కడ 122 గ్రామ పంచాయతీల్లోని సర్పంచి పదవులకు 297 నామినేషన్లు దాఖలయ్యాయి. 

తొలి దశలో ..

నోటిఫై చేసిన గ్రామ పంచాయతీలు: 4,236

సర్పంచి పదవులకు దాఖలైన నామినేషన్లు: 25,654

నోటిఫై చేసిన వార్డులు: 37,440

వార్డు పదవులకు దాఖలైన నామినేషన్లు: 82,276

#telangana sarpanch elections #telangana sarpanch election #sarpanch election #telangana local body elections 2025 #sarpanch election 2025
Advertisment
తాజా కథనాలు