TG News: దంపతుల ప్రాణాల మీదకు తెచ్చిన HIV రిపోర్ట్‌

చిన్న పొరపాటు దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. సిబ్బంది తప్పుడు మెడికల్‌ రిపోర్ట్‌ ఇవ్వడంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు ఆ దంపతులు. అసలేం జరిగిందో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

HIV report

HIV Report

New Update

TG News: ఖమ్మం జిల్లా పెనుబల్లి కమ్యూనిటీ సెంటర్‌కు రక్త పరీక్షల కోసం ఓ గర్భిణి వెళ్లింది. గర్భిణీకి రక్త పరీక్షలతో పాటు హెచ్ఐవీ పరీక్ష చేసి పాజిటివ్‌ వచ్చిందని సిబ్బంది చెప్పడంతో షాక్‌కు గురైంది. అంతేకాకుండా హెచ్ఐవి పాజిటివ్ రావడంతో గర్భిణీని ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి త్వరగా వెళ్లాలని సిబ్బంది సూచించారు.

నెగిటివ్ ఫలితాలు రావడంతో..

వెంటనే ఇంటికి వెళ్లి మెడికల్ రిపోర్ట్స్‌ను భర్తకు చూపించింది. రిపోర్ట్‌లో HIV పాజిటివ్ అని ఉండటంతో ఆందోళన చెందిన భర్త తనకు కూడా హెచ్ఐవీ సోకి ఉంటుందని కంగారుపడ్డారు. దీంతో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకుని దంపతులను కుటుంబ సభ్యులు ఓదార్చారు. తర్వాత ఇద్దరికి కల్లూరు మండలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో హెచ్ఐవీ పరీక్ష చేయించారు. నెగిటివ్ ఫలితాలు రావడంతో దంపతులు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత మళ్లీ లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ కూడా నెగటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: మన శరీరంలో మనకు తెలియని రహస్యాలు

పెనుబల్లి కమ్యునిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాపిడ్‌ టెస్ట్‌ చేయడం వల్లే ఇలా జరిగిందని సిబ్బంది చెప్పారు. తప్పుడు రిపోర్ట్‌తో తమ ప్రాణాలు పోయేవని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను  కోరారు.

ఇది కూడా చదవండి: దీపావళి తేదీపై గందరగోళం..అసలు పండగ ఎప్పుడు?

#tg-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe