Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

దసరా పండుగ కోసం భాగ్య నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా కూడా తిరిగి నగరానికి తిరిగి వస్తుండడంతో రోడ్లన్ని రద్దీగా మారాయి. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో అధికారులు వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు

hyd
New Update

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పై చౌటుప్పల్ వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు వస్తుండటంతో రోడ్డు మార్గం రద్దీగా మారింది. దసరా పండుగ కోసం భాగ్య నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా కూడా తిరిగి నగరానికి పయనమవ్వడంతో ఈ రద్దీ ఏర్పడింది.

Also Read: టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి.. దీని వెనుక సజ్జల హస్తం ఉందా?

వాహనాల రద్దీ

నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, మంగళవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కాబోతుండడంతో హైదరాబాద్‌కు చేరుకునేందుకు నగరవాసులంతా బయలుదేరారు. దీంతో జాతీయ రహదారి వాహనాలతో ఖాళీ లేకుండా కిక్కిరిసిపోయింది. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో అధికారులు వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు.

Also Read: ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు!

తెలంగాణ ప్రాంతంలో దసరా, బతుకమ్మ పండుగలు ఎంతో వేడుకగా  నిర్వహించుకుంటారు. దసరా సెలవులు కావడంతో, చాలా మంది హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు వచ్చే వాహనాలతో కరీంనగర్ -హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. భాగ్యనగరంలో నివాసం ఉన్న తెలంగాణ ప్రాంత వాసులు స్వస్థలాల నుంచి కార్లు, ఇతర వాహనాల్లో హైదరాబాద్​కు పయనం అవ్వడంతో హుస్నాపూర్ టోల్ గేట్ వద్ద వాహనాలతో రద్దీ పెరిగింది. 

Also Read: దీపావళికి ప్రయాణం చేసేవారికి శుభవార్త.. ఈ తేదీల్లో తగ్గిన ఛార్జీలు

కరీంనగర్ నుంచి వచ్చే మొదటి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల, టోల్​గేట్​ దగ్గర జాప్యం జరుగుతోంది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారి దుద్దెడ టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో అందరూ హైదరాబాద్​కు ప్రయాణం కావడంతో టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొని రెండు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. 

Also Read: మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!

దసరా సెలవులకు హైదరాబాద్​ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి భాగ్యనగరానికి సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం కావడంతో రాజీవ్ రహదారి సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో టోల్‌గేట్ లు తీసేసి ఎలాంటి రుసుము తీసుకోకుండా వాహనాలకు అనుమతి ఇచ్చారు. సాధారణ రోజుల కంటే ఈరోజు మరో లైన్​ను అదనంగా పెంచినప్పటికీ వెహికల్స్​ భారీగా రావడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి.

#traffic #hyderabad-vijayawada-highway
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe