Harish Rao: కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు (MP) అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) కు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) లీగల్ నోటీసులు పంపించారు. హిమాయత్ సాగర్ ఎఫ్ టీఎల్ లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ లో హరీశ్ రావుకు వాటాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసుల్లో ఆరోపించారు.
లీగల్ నోటీసులు అందిన 24 గంటల్లో ఎక్స్ (Twitter) వేదికగా చేసిన పోస్ట్ ను తొలగించడంతో పాటు తన క్లయింట్ (హరీశ్ రావు)కు బహిరంగ క్షమాపణ (Sorry) చెప్పాలని హరీశ్ రావు తరుఫున న్యాయవాది కోరారు. రాజ్యసభ ఎంపీగా తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకొని హుందాగా వ్యవహరించాలని హరీశ్ రావు అనిల్ కుమార్ యాదవ్ కు సూచించారు. లేనిపక్షంలో క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని ఆయన అన్నారు.
అసలేం జరిగిందంటే.. హిమాయత్ సాగర్ (Himayat Sagar) ఎఫ్ టీఎల్(FTL) భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్‌లో వాటా ఉందని తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై బురద చల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ (Congress) సర్కార్ తెరలేపిందని హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారని హరీశ్ రావు అన్నారు.
గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా హరీశ్‌రావుకు వాటాలు ఉన్నాయి అని అంటారేమో? అబద్ధపు ప్రచారం చేస్తున్న అనిల్ కు లీగల్ నోటీసు పంపుతున్నట్లు... బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్న’ అని హరీశ్ ట్వీట్ చేశారు.
Also Read: బెయిల్ కోసం ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ దరఖాస్తు