Telangana: ‘బ్యాడ్‌ టచ్‌’ అవగాహనలో అటెండర్‌ దుశ్చర్య

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో బాలసదన్‌ లో బాలికలకు బ్యాడ్‌ టచ్‌ అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డీఎల్‌ఏస్‌ఏ సెక్రటరీతో పాటు వచ్చిన అటెండర్‌ వెంకటరెడ్డి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

child
New Update

Yadadri: ఆ బాల సదనంలోని జరుగుతున్న కార్యక్రమం  ‘బ్యాడ్‌ టచ్‌.. గుడ్‌ టచ్‌’పై అవగాహన సదస్సు. కానీ అక్కడ  ఓ వ్యక్తి  ఓ బాలికపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఈ నెల 14వ తేదీన జరిగిన ఘోరానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన బాలసదనంలో జరిపారు.

Also Read:  వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత

ఈ కార్యక్రమానికి డీఎల్‌ఏస్‌ఏ సెక్రటరీతో పాటు వచ్చిన అటెండర్‌ వెంకటరెడ్డి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు దిగాడు. బాలికలకు బ్యాడ్‌ టచ్‌.. గుడ్‌ టచ్‌పై డిఫెన్స్‌ కౌన్సిల్‌ అవగాహన కల్పిస్తున్న క్రమంలో ఓ బాలిక మరుగుదొడ్డికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అటెండర్‌ వెంకటరెడ్డి ఆ బాలిక ఛాతీపై చెయ్యి వేయడంతోపాటు పెదవులపై పళ్ల గాటు పడేలా కొరికాడు.మరో బాలికతోనూ అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. పైగా విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

Also Read: తెలుగులో తమిళ్ హీరో కవిన్ రాజా 'బ్లడీ బెగ్గర్'.. రిలీజ్ డేట్ ఇదే

 శరీరంపై గాయాలను..

దీంతో భయపడిన బాలికలు తమ గదిలోకి వెళ్లి పోయారు. కార్యక్రమం ముగిశాక బాలికలు అదో రకంగా ఉండటాన్ని గమనించిన బాలసదనం సిబ్బంది వారిని ప్రశ్నించగా తమపై అటెండర్‌ వెంకట్‌రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించారు. తమ శరీరంపై గాయాలను చూపించారు. ఈ విషయాన్ని బాలసదనం సూపరింటెండెంట్‌ లలిత జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు, సీడబ్ల్యూసీ చైర్మన్‌ జయశ్రీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ నరసింహారావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి అలివేలు కి సమాచారం అందించారు.

Also Read:  వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత

పోక్సో చట్టం ప్రకారం బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడినా, లైంగిక దాడి చేసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకాకుండా ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వాలి. కానీ  డీసీపీవో సదరు వ్యక్తిపై పోక్సో చట్టం కింద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అంతేకాక తమ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందని విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఆదివారం విషయం బయటకు రావడంతో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అవుట్‌ సోర్సింగ్‌ అటెండర్‌గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి పై పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Also Read:  బ్రిక్స్‌ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe