Bloody Beggar
Bloody Beggar: కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ రాజా నటించిన లేటెస్ట్ మూవీ బ్లాడీ 'బ్లడీ బెగ్గర్'. శివబాలన్ ముత్తుకుమార్ దర్శకతకం వహించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో రెడిన్ కింగ్లీ, మారుతీ ప్రకాష్‌రాజ్, సునీల్ సుకధ, టిఎం కార్తీక్, పదం వేణు కుమార్, అర్షద్, ప్రియదర్శిని రాజ్‌కుమార్, మిస్ సలీమా, అక్షయ హరిహరన్, అనార్కలి నాజర్, దివ్య విక్రమ్, తనూజ మధురపంతుల, విద్యుత్ డెనిస్, విద్యుత్ డెనిస్, మహమ్మద్ బిలాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సింగర్ జెన్ మార్టిన్ సంగీతం అందించగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ మూవీ తమిళ్ వెర్షన్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
Also Read: BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!
తెలుగు వెర్షన్ రిలీజ్
అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. 'బ్లడీ బెగ్గర్' ను తెలుగులో నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు విడుదలను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP పంపిణీ చేస్తోంది. కవిన్ రీసెంట్ గా 'స్టార్' అనే సినిమాతో తెలుగు, తమిళ్ ఆడియన్స్ మెప్పించాడు. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Also Read: జైల్లో 2 నిమిషాల పాటు పవన్ ఏం చెప్పాడంటే.. 'అన్‌స్టాపబుల్' ప్రోమోలో బాబు సంచలనం!
Mark your calendars! #BloodyBeggar releasing in Telugu on November 7th 💥
— Asian Suresh Entertainment (@asiansureshent) October 22, 2024
AP/TG Release by @asiansureshent ✨@Kavin_m_0431 @afilmbysb @nelsondilpkumar @FivestarSenthil @KingsleyReddin @sujithsarang @JenMartinmusic @filamentpicture @thinkmusicindia @thinkstudiosind pic.twitter.com/r8OCSQFYtk
Also Read: Sarfaraz Khan : తండ్రైన ఇండియన్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇన్స్టాలో పోస్ట్!