Grama Sabha : రాష్ట్రంలో కొనసాగుతొన్న గ్రామ సభలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తోన్న గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతొన్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకోసం గ్రామ సభల్లో ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

New Update
telangana

telangana

Grama Sabha : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులైన అబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్వహిస్తోన్న గ్రామ సభలు కొనసాగుతున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర నాలుగు పథకాలకు ధరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారులను ఈ సభల్లో ఎంపిక చేయనున్నారు. స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించి గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామసభల్లో ప్రభుత్వం సంకల్పం, పథకాలను ప్రజలకు వివరించి వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.   

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ గ్రేటర్ లో మాత్రం ఎక్కడ సభలు నిర్వహించిన దాఖాలాలు కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికకోసం నిర్వహించాల్సిన వార్డు సభలు ఇప్పటివరకు మొదలు కాలేదు.  అయితే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర పథకాల ఎంపిక కోసం చేపట్టిన ఆర్థిక సర్వే గ్రేటర్ లో ఇంకా పూర్తి కాలేదు. దీంతో వార్డు సభల నిర్వహణ ఇంకా మొదలు పెట్టనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు సర్వే కొనసాగనున్న దృష్ట్యా ఫిబ్రవరి మొదటివారం నుంచి వార్డు సభలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.  

అయితే సర్వేలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లేని వారిని ఎంపిక చేస్తుండడంతో వార్డు సభల్లో లబ్ధిదారుల ఎంపిక సులభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు జరుగుతున్నప్పటికీ గ్రేటర్ లో మాత్రం ఇంకా ప్రారంభించలేదని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు