/rtv/media/media_files/lX2gdxrJjf1w6hXx7mKB.jpg)
gang-raped
TG News: చిన్నారులపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ నలుమూలనా ఏదో ఒక రకంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని బాలికలను టార్గెట్ చేసి సామూహిక అఘాయిత్యాలు చేస్తున్నారు. తాజాగా భాగ్యనగరంలో గ్యాంగ్ రేపు కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం..
రిమాండ్ కు తరలింపు:
రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్‌షా కోట్‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారానికి ఐదుగురు యువకులు పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు. బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి బాలికను పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కామంతో రెచ్చిపోయిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: గుండెపోటు వచ్చిన వ్యక్తికి వెంటనే నీళ్లు ఇవ్వవచ్చా?