BIG BREAKING : గడ్డ పోతారం మున్సిపాలిటీ BRS కైవసం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ తన దూకుడును ప్రదర్శిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డ పోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ గెలుచుకున్న మొదటి మున్సిపాలిటీ ఇదే కావడం విశేషం.

New Update
brs party

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ తన దూకుడును ప్రదర్శిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డ పోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ గెలుచుకున్న మొదటి మున్సిపాలిటీ ఇదే కావడం విశేషం. మొత్తం 18 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 14చోట్ల విజయం సాధించారు. 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇతరులు ఒక చోట విజయం సాధించారు. 

మరోవైపు మెదక్ జిల్లాలో కూడా బీఆర్‌ఎస్‌ తన బోణీ కొట్టింది. రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మద్దెల మాధవి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 39 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జిల్లాలో మొదటి ఫలితం తమకే రావడంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతానికి మెజారిటీ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది.

కాంగ్రెస్ కు బిగ్ షాక్

ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఉదయం నుంచి ఉత్కంఠగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో చిత్ర విచిత్రమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సత్తా చాటుతున్నారు. దీంతో ఇక్కడ ఫలితాలు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకటేశ్‌ అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. పార్టీల అండ లేకపోయినా స్థానిక ప్రజల మద్దతుతో ఆయన గెలుపొందడం విశేషం.

మరోవైపు బీజేపీ కూడా ఆలియాబాద్‌లో దూకుడుగా వెళ్తుంది. 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి దీపిక ఘన విజయం సాధించారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ కూడా తన పట్టును నిరూపించుకుంది. 19వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గెలిచిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ మున్సిపాలిటీ వ్యాప్తంగా సందడి చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు