jagtial : జగిత్యాల పాలిటిక్స్: క్యాంప్ రాజకీయాలతో కాంగ్రెస్‌లో హీట్!

కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సాగుతున్న ఈ కుర్చీ లాట ఇప్పుడు హైదరాబాద్‌లోని క్యాంప్ రాజకీయాల వరకు చేరింది.

New Update
sanjay

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సాగుతున్న ఈ కుర్చీ లాట ఇప్పుడు హైదరాబాద్‌లోని క్యాంప్ రాజకీయాల వరకు చేరింది.

జగిత్యాల మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు అటు జీవన్ రెడ్డి వర్గం, ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం పట్టుదలకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి జెండా మోసిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, తన వర్గానికి చెందిన వారికే చైర్మన్ పీఠం దక్కాలని ఆయన గట్టిగా కోరుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలి, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను, కానీ నా సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

జీవన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి

మరోవైపు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ బీ-ఫారమ్ మీద గెలిచిన వారు, స్వతంత్రులు, ఎంఐఎం కౌన్సిలర్లతో కలిపి మొత్తం 23 మంది అభ్యర్థులతో ఆయన ఇప్పటికే ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా జీవన్ రెడ్డి కూడా 14 మంది కౌన్సిలర్లతో హైదరాబాద్ చేరుకోవడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా జీవన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

రెండు వర్గాలు విడివిడిగా క్యాంప్‌లు నిర్వహించడంతో జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? పాత తరం నేత జీవన్ రెడ్డి మాటకు విలువ ఇస్తారా లేక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బలాన్ని గుర్తిస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

#jagityal mla sanjay kumar #jeevan-reddy #jagtial municipal elections #jagtial
Advertisment
తాజా కథనాలు