BIG BREAKING: ''రేవంత్ కు బిగ్ షాక్.. ఆ 25 ఎమ్మెల్యేలు జంప్''

కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలబోతుందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని ఆరోపించారు. ఇది సర్కార్ కూలిపోడానికి మొదటి సంకేతమన్నారు.

New Update
cm revanth congress

cm revanth congress

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలబోతుందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని ఆరోపించారు. ఇది సర్కార్ కూలిపోడానికి మొదటి సంకేతమన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో దయాకర్‌రావు ఈ కామెంట్స్  చేశారు.  

నిజస్వరూపం బయటపడుతుందని

సీఎం రేవంత్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నమ్మట్లేదని..  రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలని రాహుల్‌కు అర్ధమైపోయిందన్నారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. ప్రభుత్వ పనితీరును తెలుసుకోవడానికి  ఇటీవల రాహుల్‌ వరంగల్‌కు వచ్చేందుకు యత్నించారని,  అయితే ఎక్కడ తన నిజస్వరూపం బయటపడుతుందని సీఎం రేవంత్  ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రాహుల్ గాంధీ పర్యటనను రద్దు చేయించారన్నారు.  ఇక కేసీఆర్‌ను ఎందుకు వదులుకున్నామా అని జనాలు కూడా బాధపడుతున్నారంటూ ఎర్రబెల్లి కామెంట్స్ చేశారు.  ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ కు 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు.  కేసీఆర్ రాష్ట్రాన్ని 10 ఏళ్లు అద్భుతంగా పాలిస్తే.. కాంగ్రెస్ 15 నెల‌ల్లోనే అన్ని రంగాల్లో దివాలా తీయించింద‌న్నారు.  

ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితికి వచ్చిందని ఎర్రబెల్లి విమర్శించారు.  రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం ఉండదన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్  సోదరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇక తాను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ఆరు నెలల ముందే తెలుసని చెప్పిన ఎర్రబెల్లి..  కేసీఆర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతోనే పోటీచేశానని తెలిపారు.  ఎర్రబెల్లి చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

Also read :  ఏం మనుషులు రా మీరు...తమ ముందు బుల్లెట్‌ బండి నడిపాడని రెండు చేతులు నరికేశారు!

Also Read :  Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్‌ దాడి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు