TG-Ap: 55 సంవత్సరాల తరువాత ఓ రేంజ్‌ లో కంపించిన తెలంగాణ..!

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

New Update

TG-Ap:  తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురి చేశాయి. కొన్ని జిల్లాల్లో ఇవాళ ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించినట్లు సమాచారం. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు.

Also Read: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. అధికారిక ప్రకటన విడుదల!

రిక్ట‌ర్ స్కేలుపై 5.3 తీవ్ర‌తో భూమి ఊగిపోయింది. అయితే సుమారు 55 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తెలంగాణ‌లో ఆ రేంజ్‌లో భూమి వ‌ణికిన‌ట్లు సెసిమాల‌జీ నిపుణులు తెలిపారు. 1969లో భ‌ద్ర‌చాలం ప్రాంతంలో ఆ స్థాయిలో భూకంపం వ‌చ్చిన‌ట్లు హైద‌రాబాద్‌లోని ఎన్‌జీఆర్ఐ సెసిమాల‌జీ శాఖ మాజీ చీఫ్ డాక్ట‌ర్ శ్రీ నాగేశ్ వివరించారు.

Also Read: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం

మేడారం అట‌వీ ప్రాంతానికి స‌మీపంలో ఉండే.. భ‌ద్ర‌తాచ‌లం ప్రాంతంలో.. ఇదే స్థాయిలో 1969లో భూకంపం వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భ‌ద్రాచ‌లం-మేడారం సెక్ష‌న్‌.. సెసిమిక్ జోన్ 3లో ఉన్న‌ది.

దీంతో గ‌త కొన్ని ద‌శాబ్ధాల నుంచి ఎన్‌జీఆర్ఐ ఆ ప్రాంతంపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టి సెసిమిక్ యాక్టివిటీని గ‌మ‌నిస్తున్నట్లు సమాచారం. ద‌శాబ్ధ కాలం నుంచి ఆ ప్రాంతంలో 2 నుంచి 4 తీవ్ర‌త మ‌ధ్య రెగ్యుల‌ర్‌గా భూకంపాలు వ‌స్తున్న‌ట్లు అధికారులు వివరించారు.

Also Read: AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్‌ వేటు..!

వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయిఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు,ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని, నాగులవంచ, మణుగూరు, కొత్తగూడెం, చర్ల, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

Also Read: పట్నం నరేందర్‌రెడ్డికి బిగ్ షాక్.. ఆ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు!

 1969 త‌ర్వాత మొద‌టిసారి.. 5.3 తీవ్ర‌త‌తో భూమి కంపించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.40 కిలోమీట‌ర్ల లోతులో భూమి కంపించిన‌ట్లు నిపుణులు వెల్ల‌డించారు.

దీన్ని మాడ‌రేట్ భూకంపంగా విభ‌జించారు. రిక్ట‌ర్ స్కేలుపై 5.0 నుంచి 6.9 తీవ్ర‌త‌తో భూమి కంపిస్తే దాన్ని మ‌ధ్య‌స్థాయి భూకంపంగా నిపుణులు చెబుతారు.

 

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా ఊగింది. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు నిపుణులు తెలిపారు. ప్రధానంగా గోదావరి పరివాహాక ప్రాంతంతో పాటుగా.. కోల్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు వివరిస్తున్నారు.

 రికార్డు స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కి.మీ లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. గడ్చిరౌలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు వివరించారు. తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదు అని.. అటువంటింది 5.3 తీవ్రతతో భూమి కంపించటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe