Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. పది రోజులు సస్పెషన్స్ తర్వాత ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ బీజేపీఎల్పీ సమావేశంలో ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. డిసెంబర్ 5న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 🕥 10.40am | 4-12-2024📍Vidhan Bhavan, Mumbai | स. १०.४० वा. | ४-१२-२०२४📍विधान भवन, मुंबई.🪷 BJP Core Committee Meeting chaired by Hon Union Finance Minister Nirmala Sitharaman ji and Senior leader Vijaybhai Rupani ji🪷 मा. केंद्रीय अर्थमंत्री निर्मला सीतारमणजी व ज्येष्ठ नेते… pic.twitter.com/EhDvn3I5oO — Devendra Fadnavis (@Dev_Fadnavis) December 4, 2024 డిప్యూటిగా షిండే, అజిత్ పవార్.. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేస్తూ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సిపికి చెందిన అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ఉంటారని పార్టీవర్గాలు వెల్లడించాయి. బీజేపీ నేత గిరీష్ మహాజన్ మధ్యవర్తిత్వంతో డిప్యూటీ సీఎం పదవికి మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే అంగీకరించారు. సమాచారం ప్రకారం, షిండేకు పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖ వంటి పెద్ద మంత్రిత్వ శాఖలు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ముంబై ఆజాద్ మైదాన్‌లో ప్రమాణస్వీకారోత్సవం.. ఇక డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సాయంత్రం 5గంటలకు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డాతో పాటు అధికార ఎన్డీయే కూటమికి చెందిన అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా రానున్నట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో "మహాయుతి" కూటమి భారీ మెజారిటీ సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 41 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.