Teacher Jobs: గత పదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగ టీచర్ల జాబ్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల కల నెరవేరింది. ఇటీవల డీఎస్సీ-2024 ద్వారా టీచర్ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈరోజు పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్తగా అపాయింట్ మెంట్ అయిన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
Also Read : పాక్ ఓటమి.. ఇండియా ప్రపంచ కప్ ఆశలు ఆవిరి
కలెక్టరేట్లలోనే...
నూతన టీచర్ల పోస్టింగ్ ల ప్రక్రియ ఎక్కువగా జిల్లా కలెక్టరేట్లలోనే జరగనుంది. కాగా ఈరోజు వారు ఎక్కడికి వెళ్లి బోధించాలనే దానిపై ఈరోజు జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియ తెలియనుంది. ఎస్‌జీటీకి ఒక హాల్, స్కూల్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు కలిపి మరో హాల్ ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం మాన్యువల్ గానే కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించనున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఇచ్చే పోస్టింగ్ లేదా కేటాయించిన పాఠశాలలో ఈ నెల 16 నుంచి చేరాలని అధికారులు తెలిపారు.
కాగా నూతన టీచర్లు కేటాయించిన పాఠశాలలో చేరిన ప్లేస్ లో మూడు నెలల క్రితం బదిలీ అయి రిలీవ్ కాని వారు ఉంటే వారు గత జులైలో కేటాయించిన పాఠశాలలకు వెళ్లనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 వేల మంది ఇలాంటి వారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పోస్టింగ్‌ల ప్రక్రియ దాదాపు పూర్తవుతుందని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఏవైనా మిగిలితే వాటికి రేపు కొనసాగిస్తామన్నారు.
Also Read : మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే ...కిడ్నాప్ అయ్యాడు!
9న సీఎం రేవంత్...
ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కొత్త టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు విద్యాశాఖ అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా వారందరికీ ఆ రోజు నియామక పత్రాలు అందాయి. కాగా ఈరోజు పోస్టింగ్ ల ప్రక్రియ జరగనుంది. ఇదిలా ఉంటే కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు DSC పరీక్షలు పూర్తి అవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Also Read : ఆర్టీసీ బస్సు బోల్తా.. వృద్ధురాలు మృతి
Also Read : బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!