30 రోజుల్లో హెల్త్ కార్డులు.. శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి! మరో 30 రోజుల్లో తెలంగాణ ప్రజలకు డిజిటల్ హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య చికిత్స అందించేదుకు రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయనున్నట్లు తెలిపారు. By srinivas 26 Sep 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TG News: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ మరో శుభవార్త చెప్పారు. మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. గురువారం దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి.. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారామవుతుందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్ చికిత్స పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా సెంటర్ సేవలు అభినందనీయం. ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ ద్వారా పేదలకు వైద్య సేవలు సమర్ధంగా, తక్కువ ఖర్చుకే అందించేలా ఆలోచన… pic.twitter.com/onjcsXfxJ3 — Revanth Reddy (@revanth_anumula) September 26, 2024 హెల్త్ రికార్డ్స్ లేకపోవడం వల్లే ఇలా.. ఎవరైనా ఆసుపత్రికి వెళితే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెల్త్ రికార్డ్స్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అందుకే అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ఈ హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తాం. మనకు సమర్థుడైన ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు. హాస్పిటల్ యాజమాన్యం మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. #cm-revanth #digital-health-cards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి