/rtv/media/media_files/2025/10/15/deepak-reddy-is-the-bjp-candidate-2025-10-15-11-33-08.jpg)
BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లో పోటీ కోసం దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు.
ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై చర్చించారు. బీజేపీ నుంచి ఎవరిని పోటీపెడితే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీచేసిన మాధవీలత అభ్యర్థిత్వం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. తర్వాత ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులోనూ దీపక్‌రెడ్డి వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Follow Us