/rtv/media/media_files/2025/10/22/big-shock-to-naveen-yadav-2025-10-22-17-51-52.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 9 వేల ఓట్ల మెజార్టీకి చేరువలో ఉన్నారు. కాంగ్రెస్ ఆధిక్యంతొలి రౌండ్ 47... 2వ రౌండ్ 2,947, మూడో రౌండ్ 3,100, నాల్గో రౌండ్ 3,100గా ఉంది.
ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జాబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టబోతున్నారని, జాబ్లీహిల్స్ కాంగ్రెస్ దేనని చెప్పారు. నవీన్ యాదవ్ కు మంచి మెజార్టీ రావాల్సి ఉండేది కానీ .. ఓటింగ్ శాతం తగ్గడం ఫలితాలపై ప్రభావం చూపిస్తుందన్నారు.
186 మంది సిబ్బంది
కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.
అప్‌డేట్స్‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.
Follow Us