Jubilee Hills By-Election : రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్ లీడ్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ఈవీఎం  రౌండ్ లలో కాంగ్రెస్ అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి రౌండ్ లో  62 ఓట్లు అధిక్యాన్ని సాధించిన కాంగ్రెస్..  రెండో రౌండ్ లో 127 ఓట్ల  అధిక్యాన్ని సాధించింది.

New Update
naveen yadav

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ఈవీఎం  రౌండ్ లలో కాంగ్రెస్ అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి రౌండ్ లో  62 ఓట్లు అధిక్యాన్ని సాధించిన కాంగ్రెస్..  రెండో రౌండ్ లో 1082 ఓట్ల  అధిక్యాన్ని సాధించింది.రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు  9,691 ఓట్లు పోల్ అవ్వగా, బీఆర్ఎస్ కు  8,609 ఓట్లు పోల్ అయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్  1,144 ఓట్ల అధిక్యంలో ఉంది.  పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో కాంగ్రెస్ కు 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10గా ఉన్నాయి.తుది ఫలితం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది.

186 మంది సిబ్బంది

కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.

 అప్‌‌డేట్స్‌‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్‌‌ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు