Jaggareddy : రా.. లం***కా.. సీఐపై రెచ్చిపోయిన జగ్గారెడ్డి.. సంగారెడ్డిలో హైటెన్షన్!

సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో హైటెన్షన్‌ చోటుచేసుకుంది.  స్థానిక CI ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో.. పోలింగ్ బూత్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్‌బూత్‌ వద్ద నానా హంగామా సృష్టించారు.

New Update
FotoJet (11)

Jaggareddy

సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో హైటెన్షన్‌ చోటుచేసుకుంది.  స్థానిక CI ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో.. పోలింగ్ బూత్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్‌బూత్‌ వద్ద నానా హంగామా సృష్టించారు.--- పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. సీఐని రా..లం***కా అంటూ రెచ్చిపోయారు.తన కాలర్‌ పట్టుకున్నారంటూ సీఐపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్‌ నాయకులు భారీగా చేరుకుంటున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థి కాలర్ పట్టుకున్న సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే  సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ  జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. సీఐని సస్పెండ్‌ చేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొన్ని చోట్ల వివిధ పార్టీల నాయకులు భౌతిక దాడులకు కూడా దిగారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేయి చేసుకున్నారు. భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు డబ్బుల పంపిణీ  చేస్తున్నారంటూ..  స్థానికుల సమాచారంతో పోలింగ్‌ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు.  దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, జగ్గారెడ్డిపై మంగళవారం కేసు నమోదైంది. మంగళవారం ఉదయం సదాశివపేటలోని ఓ హోటల్‌లో వృద్ధులు, పేదలకు ఆయన డబ్బు పంచినట్లు సమాచారం. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సదాశివపేట సీఐ వెంకటేశ్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు