వాహనదారులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. అవన్నీ ఇక స్క్రాప్‌కే!

సొంత వాహనాలను 15ఏళ్లు దాటిన తర్వాత స్క్రాప్‌కు అప్పగించాలని తెలంగాణ రవాణాశాఖ కమిషనర్ ఇలంబత్రి సూచించారు. కచ్చితంగా స్క్రాప్ పాలసీలో చేరాలని లేదని.. వాహనాలు స్క్రాప్‌కి పంపకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

cm revanth's government sensational decision on scrap policy
New Update

దేశీయ మార్కెట్లో వాహనాల హవా పెరిగిపోయింది. కొత్త కొత్త వాహనాలు సైతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో ధరలు అధికంగా ఉండటంతో కొందరు సెకండ్ హ్యాండ్ బైక్ లను విక్రయిస్తున్నారు. తమ బడ్జెట్లో కొత్త బైక్ కొనుక్కోలేక పాత బైక్ నే ఏళ్లకు ఏళ్లు నడుపుతున్నారు. అయితే అలాంటి వారికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. 15 ఏళ్లు దాటిన వెహికల్స్ స్క్రాప్ కు అప్పగించాల్సిన విషయంపై తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ ఇలంబిత్రి కీలక విషయాలు వెల్లడించారు. సొంత వెహికల్ 15 ఏళ్లు దాటిన తర్వాత వాలంటీర్ గా స్క్రాపింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించి.. సర్టిఫికేట్ ఇస్తే వచ్చే రెండు ఏళ్లలో కొత్త వాహనాలు సేమ్ వెహికల్ కొంటే లైఫ్ టాక్స్ లో ఫీజు తగ్గింపు ఉంటుందని చెప్పారు. 

మోటార్ వాహన చట్టం

అయితే ఇవన్నీ మోటార్ వాహన చట్టం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారని.. అందులోంచి బెస్ట్ పాలసీని తీసుకున్నాం అని తెలిపారు. పాత బకాయిలు ఉన్నా వెహికల్ స్క్రాప్ కి తీసుకెళ్తే వన్ టైం సెటిల్మెంట్ చేసేలా అవకాశం ఇవ్వాలని మోటార్ వాహన చట్టంలో ఉందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాల ప్రకారం.. సెక్షన్ 52 A ప్రకారం రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయలేని లేదని తెలిపారు. 

ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ మాట్లాడుతూ.. 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలు స్క్రాప్ కి యాక్షన్ ద్వారా పంపించాలి అని అన్నారు. ప్రభుత్వ వాహనాలు మండిటరి అని చెప్పారు. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ద్వారా వాహనాలు ఆటోమేటిక్ మిషన్ ల ద్వారా చేస్తాయని.. ఎంవి యాక్ట్ లో ఉన్న ప్రకారమే ఇదంతా జరుగుతుందని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండిః నేడు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ప్రభుత్వం 37 టెస్టింగ్ సెంటర్స్ పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వగా.. జిల్లాలో 33, హైదరాబాద్ లో 4 అదనంగా పెట్టనున్నట్లు తెలిపారు. అయితే ఇవి పెట్టేందుకు ఒక్కో టెస్టింగ్ సెంటర్ కి దాదాపు రూ.8 కోట్లు అవసరం అవుతుందని.. మొత్తంగా రూ.296 కోట్లు కేటాయించారన్నారు. సారధి వాహాన్ సంవత్సరం లోపు మొత్తం ఇంప్లిపెమెంట్ చేస్తామని సాఫ్ట్ వేర్ అప్ గ్రేడేషన్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. 

15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలు స్క్రాపింగ్ పాలసీలో కచ్చితంగా చేసుకోవాలని లేదని తెలుపుతూ.. అది వాళ్ల ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చని అన్నారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు 8 సంవత్సరాలు లోపు దాటితే ప్రతి సంవత్సరం / త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఇవ్వబడుతుందని తెలిపారు. అలాగే 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవాలంటే అదనంగా టాక్స్ కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

#revanth-reddy #vehicle-scrappage-policy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe