CM Revanth : సీఎం ఇంటిదగ్గర బాంబు.. పోలీసుల అదుపులో ఆ ఇద్దరు!

సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర బాంబు బ్యాగ్ వదిలివెళ్లిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. టిల్లు అనే వ్యక్తితోపాటు బైక్ ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అది సినిమా షూటింగ్‌ల కోసం వాడే డమ్మీ బాంబుగా గుర్తించారు.

CM Revanth Reddy
New Update

CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇందులో బాంబు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అది సినిమా షూటింగ్‌ల కోసం వాడే డమ్మీ బాంబుగా నిర్ధారించిన అధికారులు.. అది అక్కడకు ఎలా వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటపడ్డాయి. 

ఆటో డ్రైవర్ సమాచారంతో..
శ్రీకృష్ణనగర్‌ కు చెందిన చేపల వ్యాపారి టిల్లు అనే వ్యక్తి ఈ బ్యాగ్ అక్కడ వేసినట్లు గుర్తించారు. సినీ పరిశ్రమలో పరిచయం ఉన్న ఓ వ్యక్తి బైక్ తీసుకుని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర ప్రయాణించే మార్గంలో మూత్రవిసర్జన చేశాడు టిల్లు. ఆ తర్వాత తన జేబులో ఉన్న కొన్ని కాగితాలను బైక్ లో పెడుతుండగా.. బాంబు లాంటి వస్తువు కనిపించింది. దీంతో కంగారుపడ్డ టిల్లు దాన్ని తీసి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. అయితే ఈ విషయం గమనించిన ఓ ఆటోడ్రైవర్‌ పోలీసులకు సమాచారం అందించగా అప్రమత్తమయ్యారు. ఇక సీసీ ఫుటేజీ ఆధారంగా బండి నంబరు గుర్తించి టిల్లుతోపాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

#cm-revanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe