CI Sathish Kumar : TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్‌కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్‌కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్ ప్రయాణించిన రైల్లోనే ఏదో జరిగిందని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

New Update
satish-kumar-2025-11-15-08-43-27

TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్‌కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్ ప్రయాణించిన రైల్లోనే ఏదో జరిగిందని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్ బెర్త్ నెం.29 అయితే.. 11వ నెంబర్ వద్ద లగేజీ బ్యాగ్ దొరికింది. తిరుపతి RPF ఆఫీసుకు సతీష్ బ్యాగ్‌ ఎలా చేరిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ TC, సిబ్బంది, బెడ్‌రోల్ అటెండర్లను పోలీసులు విచారించారు.

బొమ్మలను తోసేసి సీన్ రీకన్‌స్ట్రక్షన్

ఘటనాస్థలంలో రన్నింగ్ రైలు నుంచి బొమ్మలను తోసేసి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. కేసు పురోగతిలో  పోస్ట్‌మార్టం రిపోర్ట్, కాల్ డేటా కీలకంగా మారింది. సతీష్‌కుమార్‌పై పక్కా ప్లాన్‌తో దాడి చేసినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోవైపు పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ చరిత్రపైనా ఆరా తీస్తున్నారు. సీఐడీ విచారిస్తుండగానే సతీష్‌ ప్రాణాలు తీయడంతో చోరీ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్‌కుమార్‌ గతంలో టీటీడీ ఏవీఎస్‌వోగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సతీష్‌కుమార్ మృతికి TTD పరకామణి చోరీ కేసుతో సంబంధం ఉంది. 2023లో ఈ చోరీని గుర్తించి, ఫిర్యాదు చేసినది ఆయనే.

Advertisment
తాజా కథనాలు