/rtv/media/media_files/2025/10/31/maganti-2025-10-31-10-26-07.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఊహించని షాక్ తగిలింది ఆమెపై బోరబండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి ఆమెపై ఆర్‌వోకు ఫిర్యాదు చేశారు. దీంతో మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆమె పంపిణీ చేస్తున్నారంటూ మోహన్‌రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. మోహన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మాగంటి సునీతపై బోరబండ పోలీసులు కేసు బుక్ చేశారు. అయితే దీనిపై మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
బ్రేకింగ్ న్యూస్
— Mirror TV (@MirrorTvTelugu) October 31, 2025
ఓటమి భయంతో మాగంటి సునీత మీద కాంగ్రెస్ పార్టీ వరుస కుట్రలు
కారు గుర్తు ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు
ఫిర్యాదు అందిన వెంటనే బోరబండ పోలీస్ స్టేషన్‌లో మాగంటి సునీతపై కేసు నమోదు చేసిన ఎన్నికల సంఘం అధికారులు
తాము… pic.twitter.com/zguHYHpYMv
కాగా మాగంటి సునీత భర్త గోపీనాథ్ మరణతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. 2025 నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో అత్యధికంగా 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు. నియోజకవర్గ చరిత్రలో ఇది రికార్డు.
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us