TG News: కారు బీభత్సం.. పాతబస్తీలో రెచ్చిపోయిన మైనర్లు..

హైదరాబాద్‌లో ర్యాష్ డ్రైవింగ్‌తో హోండా సిటీ కారుతో ఓవర్ స్పీడ్‌తో వెళ్లి దబిర్‌పూరా ఫ్లైఓవర్‌ డివైడర్‌ను ఢీ కొట్టారు. కారు బోల్తా పడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసిను కారును సీజ్‌ చేశారు.

New Update
car accident hyd

car accident

TG News: హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. ర్యాష్ డ్రైవింగ్‌తో ముగ్గురి మైనర్లు రెచ్చిపోయారు. హోండా సిటీ కారుతో ఓవర్ స్పీడ్‌తో వెళ్లి దబిర్‌పూరా ఫ్లైఓవర్‌ డివైడర్‌ను ఢీ కొట్టారు. కారు బోల్తా పడటంతో ముగ్గురు మైనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం కారు వదిలి ముగ్గురు పారిపోయారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన పరిస్థితిని పరిశీలించి కారును సీజ్‌ చేశారు. 

కారు సీజ్‌:

నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. కారు ఓనర్ పేరు సయ్యద్ యూసుఫ్‌ అలీగా పోలీసులు గుర్తించారు. 2022 లోని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఈ కారుపై కేసు నమోదు అయినట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఈ చలానా కూడా కట్టలేదని పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు యువకుల ర్యాష్ డ్రైవింగ్ చూసి పాతబస్తీలోని ప్రజలను భయభ్రాంతులకు గురైయ్యారు. ఈ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇంకా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: జర్నలిస్టుల పరువు తీశారు కదరా.. రిపోర్టర్లమంటూ దందాలు.. ఏడుగురిపై కేసు బుక్

Advertisment
తాజా కథనాలు