/rtv/media/media_files/2026/02/23/cabinet-decides-2026-02-23-20-49-16.jpg)
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థ L&T నుంచి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మెట్రో భవిష్యత్తులో కీలక మలుపుగా మారనుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
#Telangana Cabinet meeting chaired by Chief Minister A Revanth Reddy at Secretariat today approves takeover of #Hyderabad Metro Rail phase-1 project from L&T. The decision facilitates expansion of Metro Rail on all sides of Hyderabad under phase-2 and also facilitates Central… pic.twitter.com/SL0yZQvWNS
— L Venkat Ram Reddy (@LVReddy73) February 23, 2026
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. వీరు ఎల్ అండ్ టీతో చర్చలు జరిపి, బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తారు. గత ఏడాది జరిగిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వం ఎల్ అండ్ టీకి రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా చెల్లించనుంది. అలాగే, మెట్రో ప్రాజెక్టుపై ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల రుణాలను కూడా ప్రభుత్వమే భరించడానికి సిద్ధమైంది.
మెట్రోకు సంబంధించిన ఆస్తులు, వాటి విలువను లెక్కించే బాధ్యతను ఐడీబీఐ క్యాపిటల్ చేపట్టింది. మరోవైపు, మెట్రో రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక నివేదికలను అందించింది. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తోంది. ఈ మార్పు వల్ల మెట్రో విస్తరణ, టికెట్ ధరల నియంత్రణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం లభించనుంది.
Follow Us