/rtv/media/media_files/2026/02/13/vivek-2026-02-13-11-01-13.jpg)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలో వెలువడిన ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మంత్రి నియోజకవర్గం కావడంతో ఇక్కడ కాంగ్రెస్ విజయం ఖాయమని భావించినప్పటికీ, ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. వరుస విజయాలతో క్యాతనపల్లిలో గులాబీ జెండా రెపరెపలాడింది. తన సొంత ఇలాకాలో బీఆర్ఎస్ విజయం సాధించడం అధికార పార్టీకి ఊహించని షాక్ అని చెప్పవచ్చు.
ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గానూ ఏకంగా 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేసి, మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకున్నారు. మిగిలిన మూడు వార్డుల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తానికి, ఒక చోట బీఆర్ఎస్ పట్టు నిరూపించుకోగా, మరోచోట కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా ఫలితాలను సాధించింది.
Follow Us