/rtv/media/media_files/2025/06/16/EMG4ml3aM6FFdfKB3kZe.jpg)
KTR
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 39 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 27 వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 6 వార్డులకే పరిమితం కాగా, బీజేపీ 5 వార్డుల్లో, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ పట్టు నిలబెట్టుకోవడం విశేషం. మరోవైపు వేములవాడ మున్సిపాలిటీలో ఫలితాలు అనిశ్చితిగా మారాయి. మొత్తం 28 వార్డుల్లో ఏ పార్టీ కూడా స్వతంత్రంగా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (15 వార్డులు) అందుకోలేకపోయింది. ఇక్కడ 13 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్, ఇతరులు లేదా బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కింగ్ మేకర్లుగా మారిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు ఎటు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Follow Us