పరోక్షంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై తెలంగాణ జాగృత నాయకురాలు కవిత సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నల్లగొండలోని ఓ బీఆర్ఎస్ నేత ఎగిరెగిరి పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యాడు. అలాంటి లిల్లీపుట్ నేత కూడా నా మీద మాట్లాడుతన్నాడు. అసలు కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్ లీడర్ ఎవరు? అని ఆమె ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. " నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు... కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణ లు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న " అంటూ ఆయన ట్విట్ చేశారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
మరోవైపు కవిత వ్యాఖ్యలకు షీప్స్ అండ్ గోట్స్ మాజీ కార్పొరేషన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మద్దతు ఇచ్చారు. కవిత చెప్పింది నిజమే.. జగదీశ్వర్ రెడ్డి పెద్ద దొంగ అని వ్యాఖ్యనించారు. జగదీశ్వర్ రెడ్డి, గాదరి కిషోర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌కు దూదిమెట్ల లేఖ రాశారు. జగ్గూ,మగ్గు అంటూ జగదీశ్వర్, కిషోర్‌లను ఉద్దేశించి దూదిమెట్ల కామెంట్స్ చేశారు. నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి కారణంగా నష్టపోయిన వాళ్లు అంటూ ఓ జాబితా రిలీజ్ చేశారు. ఉద్యమంలో ఉన్న కేసీఆర్ సైనికులకు కనీస గౌరవం దక్కట్లేదని వాపోయారు.
లిల్లీపుట్ నాయకుడు
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని 'లిల్లీపుట్ నాయకుడు' అని కవిత సంబోధించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర తక్కువని, కేసీఆర్ ఉండబట్టే ఆయన ఈ స్థాయిలో ఉన్నారని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వంటి వారి ద్వారా తనపై అనుచిత వ్యాఖ్యలు చేయించి జగదీష్ రెడ్డి ఆనందం పొందుతున్నారని కవిత ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, తనను ఒంటరిని చేయాలనే ప్రయత్నాలు ఫలించవని కవిత హెచ్చరించారు.
కాగా ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగదీష్ రెడ్డి కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో కవిత పరిస్థితి ఏంటని అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గురించి మాట్లాడటానికి ఏం లేదు. ఆమె గురించి మాట్లాడటం టేమ్ వేస్ట్ అని అన్నారు. ఆమె గురించి పార్టీలో పెద్దగా ఎవరూ మాట్లాడుకోరని... ముఖ్యంగా ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదన్నారు జగదీష్ రెడ్డి. దీంతో ఆయన కామెంట్స్ పై కవిత పరోక్షంగా లిల్లీపుట్ నాయకుడు అని కౌంటర్ ఇచ్చారు.
MLA Jagadish Reddy : కవిత లిల్లీపుట్ కామెంట్స్.. జగదీష్ రెడ్డి రియాక్షన్ ఇదే!
పరోక్షంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై తెలంగాణ జాగృత నాయకురాలు కవిత సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నల్లగొండలోని ఓ బీఆర్ఎస్ నేత ఎగిరెగిరి పడుతున్నారు.