/rtv/media/media_files/2025/11/07/brs-party-2025-11-07-10-32-01.jpg)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌లో వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి కాంగ్రెస్ MLA భర్త దయానంద్‌పై BRS నేతలు ఆర్వోకి ఫిర్యాదు చేశారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు బోరబండలోని బూత్ 348తో పాటుగా 11 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్ ఆలస్యమైంది. ఈవీఎంలను రీ ప్లేస్ చేసి పోలింగ్ కంటిన్యూ చేస్తున్నారు. పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడ లోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఆమె ఓటు వేశారు సునీత. ఆమె కుమారుడు, కూతురు కూడా ఓటు వేశారు. .
కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత,బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విధుల్లో 5 వేల మంది సిబ్బంది ఉన్నారు. పోలింగ్‌కు 1,761 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంది. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల ఉపయోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Follow Us