BIG BREAKING: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతో మల్లారెడ్డి భేటీ.. రేపే రేవంత్ రెడ్డితో?

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా మల్లారెడ్డి కలిసి మనవరాలి వివాహానికి ఆహ్వానిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

mallareddy Revanth Reddy
New Update

మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రగతిభవన్ లో కలిశారు. తన మనవరాలు శ్రేయరెడ్డి వివాహానికి రావాలని ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను సైతం కలిసి ఆహ్వానపత్రికను అందించారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురి వివాహం నేపథ్యంలో ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు మల్లారెడ్డి. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ ను రాజశేఖర్ రెడ్డి దంపతులు, మల్లారెడ్డి కలిసి ఆహ్వానపత్రిక అందించి వివాహానికి రావాలని ఆహ్వానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావును సైతం ఇటీవల వీరు కలిసి వివాహానికి ఆహ్వానించారు. అయితే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలవడంతో సీఎం రేవంత్ రెడ్డిని కూడా మల్లారెడ్డి కలిసి ఆహ్వాన పత్రిక అందించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

రేవంత్ అపాయిట్మెంట్ ఇస్తారా?

మల్లారెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ను కోరినట్లు సమాచారం. అపాయిట్మెంట్ లభిస్తే వెంటనే వెళ్లి తన మనవరాలి వివాహానికి ఆహ్వానించడానికి మల్లారెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు నుంచి రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య తీవ్ర వివాదాలు ఉన్నాయి. రేవంత్ టార్గెట్ గా మల్లారెడ్డి అనేక సార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 

ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి తన మనవరాలి వివాహానికి ఆహ్వానిస్తుండడం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని కూడా మల్లారెడ్డి కలుస్తారా? లేదా? అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠగా మారింది.

#malla-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe