MLA KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని అన్నారు. కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఊసే తీయడం లేదని అన్నారు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదని చెప్పారు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!
రైతులు కల్లాల్లో కన్నీళ్లు....
ఈ సీజన్లో మంత్రులు 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని గుర్తు చేశారు. అక్టోబరు నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కానీ, అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని... రైతన్న అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్ల్యక్షం చూడండి అని నిలదీశారు.
దళారులతో కుమ్మక్కు అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని మండిపడ్డారు. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదని అన్నారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్..భారీగా ధరల పెంపు!
కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచిందని అన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో
డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నాడని విమర్శించారు.