Balkasuman : బీఆర్‌ఎస్‌ నేత బాల్కసుమన్‌కు బెయిల్‌ మంజూరు..అసలేం జరిగిందంటే?

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ పాలక వర్గం ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు న్యాయస్థానం ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది.

New Update
FotoJet (16)

BRS leader Balkasuman granted bail

Balkasuman : మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు న్యాయస్థానం ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది. సుమన్‌తోపాటు మరో ముగ్గురికి బెయిల్‌ మంజూరు చేస్తూ మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ సందర్భంగా ఫిబ్రవరి 18న మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్కసుమన్‌ అరెస్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కాగా, సుమన్‌ బెయిల్‌పై విడుదలైనప్పటికీ.. ప్రతి ఆదివారం రామకృష్ణపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలని న్యాయస్థానం షరతు విధించింది.

అసలేం జరిగిందంటే..

తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లల ఎన్నికలు అనేక చోట్ల ఘర్షణలకు దారితీశాయి. మంచిర్యాల జిల్లా  క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా రసాభాసగా మారింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌, సీపీఐ కూటమిగా పోటీ చేసి విజయ సాధించగా, కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చాయి. అయితే అక్కడ స్థానిక మంత్రి, ఎంపీ హోదాలో ఉన్న వివేక్‌, వంశీకృష్ణలు తమకున్న ఎక్స్ అఫీషియో హోదాలో క్యాతనపల్లిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే  తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి క్యాతనపల్లి చేరుకున్న కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి వివేకా కారు అద్దాలు ధ్వం సం అయ్యాయి. దీనిపై ఎస్‌ఐ గంగారాం, కానిస్టేబుల్‌ నరేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుతో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం మంచిర్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం సుమన్‌ను ఆదిలాబాద్‌ జైలుకు తరలించారు. కాగా ఈ రోజు ఆయనకు బెయిల్‌ మంజూరు కావడంతో ఆయన విడుదల కానున్నారు.

Advertisment
తాజా కథనాలు