అరెస్ట్ కాబోతున్నా.. పార్టీ నేతల వద్ద కేటీఆర్ ఎమోషనల్!

తనను అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు. దీనిపై పోరాటం చేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. లగచర్ల కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చన్న ప్రచారం సాగుతోంది.

New Update

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి అంశం బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ రేపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్టు వార్తల నేపథ్యంలో కేటీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను ఏదో ఒక కేసులో అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని పార్టీ నేతలతో అన్నారు. దీనిపై పోరాటం చేయడానికి పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

#ktr #revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe