BIG BREAKING: 'ఢిల్లీలో సెటిల్మెంట్.. కేటీఆర్ అరెస్ట్ కు బ్రేక్'

KTR అరెస్ట్ కథ కంచికేనని.. ఢిల్లీలో సెటిల్మెంట్ జరగడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ ఇక గాలికేనన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు.

KTR Arrest Revanth
New Update

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ అరెస్ట్ వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో ఈ రోజు బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో సెటిల్మెంట్ జరిగిందని.. ఇక కేటీఆర్ అరెస్ట్ కథ కంచికేనన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ గాలికేన్నారు. కలెక్టర్ పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్​కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్!

తెలంగాణలో ఆర్కే పాలన..

కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమేనన్నారు. రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరుపిస్తానన్నారు. అయితే.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: మాట తప్పి చేతులెత్తేసిన రేవంత్.. మహారాష్ట్ర ప్రచారంలో పవర్ స్టార్ పంచులు!

రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని అన్నారు. దాడులతో ప్రజల ప్రాణాలాతో చెలగాటాలాడుతోందన్నారు. గ్రూప్-1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలన్నారు. రాష్ట్ర ప్రజలారా వాస్తవాలు ఆలోచించండి.. అని పిలుపునిచ్చారు. 

#ktr #Bandi Sanjay
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe