/rtv/media/media_files/2025/09/12/engineering-2025-09-12-21-48-59.jpg)
తెలంగాణలో విద్యార్థులకు బిగ్ అలర్ట్. రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్ 15 నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై ఇవాళ ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తోంది. సానుకూల నిర్ణయం రాకపోతే కాలేజీలు మూతబడే అవకాశం ఉంది. బంద్‌లో అన్ని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా, నర్సింగ్ కాలేజీలు పాల్గొననున్నాయి. బంద్‌తో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. రూ.1200 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు ఫెడరేషన్ చెప్తుంది. దసరాలోపు 60 శాతం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది.
సెప్టెంబర్ 15వ తేదీ నుండి కాలేజీలు బంద్
— Volga Times (@Volganews_) September 12, 2025
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని, వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 15వ తేదీ నుండి కాలేజీలు మూసివేస్తామని హెచ్చరించిన ప్రైవేటు… pic.twitter.com/QlkOCGoYYs
సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని
సెప్టెంబర్ 15న బ్లాక్ డేను ప్రకటించింది ఫెడరేషన్ . రియింబర్స్‌మెంట్ చెల్లింపులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఫెడరేషన్ కోరుతుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో.. తమ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు.మరోవైపు ఇంటర్, డిగ్రీ కాలేజీలు సైతం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని.. గత కొంతకాలంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.