Telangana: రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు!

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

New Update
ap rains

Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల  పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

 మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్సులు ఉన్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌,  నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

శుక్రవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశలున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు