Warangal Airport: తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటు రంగం సిద్ధమైంది. వరంగల్ జిల్లాలోని మామునూరులో 1930లో నిజాం హయాంలో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్ట్ 1980లో కొన్ని కారణాల వల్ల మూతపడి ఉంది. కాగా ఆ నాటి నుంచి నేటి వరకు ఎయిర్ పోర్ట్ వినియోగంలో లేదు. తాజాగా మామునూరు విమానాశ్రయానికి విమాన రాకపోకలు జరగనున్నట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనిపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సర్వేలు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!
150 కి.మీ వరకు నో ఎయిర్ పోర్ట్....
రెండు తెలుగు రాష్ట్రాలు వేరు కాకా ముందు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్న సమయంలో ఆనాటి ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్ లో నిర్మించింది. GMR సంస్థకు నిర్మాణ కాంట్రాక్ట్ ను అప్పగించింది. అయితే కొన్ని నిబంధనల నడుమ ఈ నిర్మాణ ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. అయితే.. నిబంధనల ప్రకారం శంషాబాద్ విమానాశ్రయానికి 150 కి.మీ.ల పరిధిలో 30 ఏళ్ల పాటు (2038 వరకూ) వాణిజ్య విమానాశ్రయాలను ఏర్పాటు చేయవద్దని ఆ సంస్థ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తాజాగా ఆ ఒప్పందాలను పక్కకి పెట్టి మామునూరులో విమానాశ్రయం నిర్మాణానికి ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా.. ఈ నిర్మాణానికి మొత్తం 950 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 696 ఎకరాల భూమి ఏఏఐ పరిధిలో అందుబాటులో ఉండగా, మరో 253 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!
విమానాశ్రయం ఉందని మర్చిపోయారు...
తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం కాకుండా ఇంకొకటి ఉందని చాలా మంది మర్చిపోయారు. అయితే ఇది ఇప్పుడు కొత్తగా నిర్మించింది ఏమి కాదు.. వరంగల్ జిల్లాలోని మామునూరులో 1930లో నిజం కాలంలో నిర్మించారు. కొన్ని ఏళ్ళ పాటు అక్కడ విమాన సేవలు నడిచాయి. అయితే కొన్ని కారణాల వల్ల అతి మూతపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పశువులను పెపేందుకు స్థలం లాగా మిగిలిపోయింది. 2017లో కేంద్రం తీసుకొచ్చిన ‘ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్’ (ఉడాన్) పథకం కింద మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గుర్తించారు. కాగా తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతోపాటు, మామునూరు ఎయిర్‌పోర్టును డెవలప్ చేయాలని అప్పటి ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కానీ దీనికి ముందడుగు పడలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేసింది. GMR సంస్థతో పలు మార్లు చర్చలు జరపగా.. ఎట్టకేలకు 150 కిమీ నిబంధలను పక్కకు పెట్టి మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి ఒప్పుకుంది. కాగా శంషాబాద్ విమానాశ్రయానికి మామునూరు 146-148 కి.మీ.లలోపే ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి!