/rtv/media/media_files/2024/12/26/22jASuOF26ghCoD4dsoo.jpg)
Sandya theatre issue
సంధ్య థియేటర్ వద్ద ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ థియేటర్ లోకి ఎప్పుడు వెళ్లాడు?... రేవంత్ ఏ సమయంలో చనిపోయింది. అన్ని వివరాలను సమగ్రంగా తెలిపే ఎక్స్ క్లూజీవ్ వీడియో RTV వద్ద ఉంది. అల్లు అర్జున్ థియేటర్ లోకి రాకముందే రేవతి చనిపోయిందన్న ఓ ఫేక్ వీడియో నిన్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. దీనిపై పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. తప్పుడు వీడియోలను ఇలా సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: YEAR ENDER 2024: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!
ఈ నేపథ్యంలో RTV అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు RTV రంగంలోకి దిగింది. అసలైన వీడియోను సేకరించింది. ఆ వీడియో ప్రకారం.. రాత్రి 8 గంటల 58 నిమిషాలకు అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్తున్నట్లుగా స్పష్టమైంది. తొక్కిసలాట కారణంగా చనిపోయిన రేవతిని రాత్రి 9 గంటల 16 నిమిషాలకు బయటకు తీసుకెళ్తున్నారు. దీంతో అల్లు అర్జున్ థియేర్లోకి వచ్చిన తర్వాతనే తొక్కిసలాట జరిగినట్లుగా స్పష్టం అవుతోంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే?
/rtv/media/media_files/2024/12/26/allu-arjun-entry-time.jpg)
/rtv/media/media_files/2024/12/26/screenshot-2024-12-26-171354.jpg)
ఫేక్ వీడియోలో ఏముంది?
నిన్న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఫేక్ వీడియోలో రాత్రి 9.16 గంటలకే రేవతిని బయటికి తీసుకొస్తున్నట్లుగా ఉంది. 9.40 ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్లోకి వచ్చినట్లుగా ఉంది. అయితే.. ఈ వీడియో ఆధారంగా సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు పోలీసులపై ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ రాకముందే ఆమె చనిపోయిందని.. పోలీసులు అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కావాలనే ఈ కేసులో అల్లు అర్జున్ ను ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు RTV బయటపెట్టిన వీడియో ద్వారా ఈ ఫేక్ ప్రచారానికి చెక్ పడింది.
/rtv/media/media_files/2024/12/26/rePMkYBCdnFIykiPZwHB.jpg)
నిన్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో..
సీసీటీవీ ఫుటేజీ సాక్షిగా.. అల్లు అర్జున్ రాకముందే సంధ్య థియేటర్ వద్ద ఘటన
— Telangana Chitralu (@tgchitralu) December 25, 2024
తొక్కిసలాట జరిగాక.. 9:16 గంటలకు రేవతిని బయటకు తీసుకొచ్చిన ప్రేక్షకులు
సంధ్య థియేటర్‌కు.. 9:35 - 9:40 గంటల టైంలో చేరుకున్న అల్లు అర్జున్
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న థియేటర్ సీసీటీవీ ఫుటేజీ… pic.twitter.com/JwFUVr6M9u